నా ప్రియమైన యేసు ప్రభూ-వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా-స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా-స్తోత్రము స్తోత్రములు
1. ఆపద దినములలో-నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే-నాధా ఆశ్రయం పొందితిని ..నా
2. ఒక క్షణ సమయములో-నశియించు నా జీవితం
నా హృదయం మార్చితివి-దేవా నీతోనే జీవించుటకై ..నా
3. ఈ దినము నే పాడుట-నీవలనే యేసుప్రభూ
ఎల్లప్పుడు నే పాడెదన్-దేవా నాయందు వసియించుము ..నా