నన్ను అర్థం చేసుకున్నాడు -నా అక్కరలన్నీ తీర్చాడు
అమితంగా ప్రేమ చూపి-అనవరతం నాకు తోడై
ఆలకించి- అనుభవించి-ఆదరించి
ఆదుకున్నాడు
ఓ………యేసుని ప్రేమ -అది శాశ్వత ప్రేమ
1.ఎవరికి నే సరిపోను ఓ….ఎందుకు నే కొరగాను (2)
అయినను నా యేసు దేవుడు ఎంచుకున్నాడు (2) ||ఓ||
2.కృంగిపోయిన సమయములో
కరముతో నన్ను లేపాడు(2)
ప్రోత్సహించి ధైర్యపరచి స్థితిని మార్చాడు (2) ||ఓ||