నా ప్రాణమా – నా అంతరంగమా
నా ప్రభువూ యేసునీ – స్తుతియించుమా
1. మార్పులేని దేవుడ నీవూ – మారనీ వాగ్దానములు
మా కొరకు దాచిన తీరూ – వర్ణింపలేరు ఎవరూ
స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా – మహిమాన్వీతా
పరిశుద్ధుడా – పవిత్రుడా – నా యేసయ్యా ||నా ప్రాణమా||
2. సత్యము జీవము మార్గం యేసయ్యా నీవెగా
మా పాప పరిహారార్థం – చిందినా నీ రక్తం ||నా ప్రాణమా||
3. పరలోక మహిమను వీడి – దిగి వచ్చెనే యేసయ్యా
మనుజాళి రక్షింపను – మరణించిలేచెనూ ||నా ప్రాణమా||