దేవుని సీయోను పురమా
శ్రేష్టమౌ పట్టణమా
స్థావరంబైన పురమా
దేవుని నివాసమా
యుగముల శిలయైన
దేవుడే నీ పునాది
శత్రువు జయించలేని
రక్షణ నీ దుర్గము
1కాంచుమా సజీవ ధారల్
శాశ్వత ప్రేమ ధారల్
నీదు పుత్రికా పుత్రులన్
తృప్తి పర్చు దారలన్
అలసి సొలయకుండ
దాహమున్ తీర్చు దార
దాతయో దేవుని కృప
సర్వ కాలంబు పారున్
3 కాంచుమా నీ యిండ్లమీద
అగ్ని మేఘంబుల్దిగె
ప్రభుని రాక సమయం
బని మహిమ దెల్ప
ప్రార్థన ఫలంబులిఛ్చి
మన్నా నిఛ్చిన ప్రభు
సింహాసనాసీనుడై సు
నాధ స్తోత్రంబుల్ వినెన్