దేవుడినడ్డంబెట్టిమోసాలు చెయ్యబోకు
బైబిలు పేరు చెప్పి వేషాలు వెయ్యబోకు
ఓ..పెద్దాన్నా… నా మాట వినరన్నా
ఓ.. చిన్నన్నా…ఈ మాట నిజమన్నా
1. కన్నులిచ్చినవాడు కానకుండునా
అన్యాయమైన పనులు చూడకుండునా
మనుష్యుల కళ్ళు కప్పినా దేవుని నీతి ఒప్పునా
కప్పుకొనక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందుము ఇప్పికైనా
2. దేవుని సొమ్ము నీవు దొంగిలించినా
దైవసేవ అంటూ నీ ఆస్తి పెంచినా
అన్యాయపు సిరి నిలుచునా – దేవుని శిక్ష తప్పునా
కప్పుకొనక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందాుము ఇప్పటికైనా
3. స్వార్ధానికై వాక్యం కలిపి చెరిపినా
లాభానికై అనుకూలముగా మార్చినా
పరలోక తండ్రి ఓర్చునా – ఉగ్రత చూపక మానునా
కప్పుకొనక నీ తప్పులొప్పుకొని మెప్పును పొందుము ఇప్పటికైనా