దేవా నా యందు-ఎంతో ప్రేమ-నీ దివ్య ప్రేమ నాలో -ఉప్పొంగెను హల్లెలూయా…..2
1. దినదినము నీదు ప్రేమ-రుచి చూచుచున్నాను
దయ గల జీవహారం తో- పోషించుచున్నావు
దేవా !నీ జీవ జలము -నాకిచ్చితివే -నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||
2. నా పాదములను నీవు -బండపై నిలిపితివి
నా అడుగుల నెల్ల -స్థిరపరిచిన దేవుడవు
దేవా!నా కాశ్రయుడవు- నీవే కదా -నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||
3. సిలువలో రక్తము కార్చి-నను రక్షించితివి
సార్వత్రిక సంఘములోన -నన్నైక్యపరచితివి
దేవా!నీ దయ నా యెడల అత్యున్నతం-నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||
4. వాగ్దానములు నాలో- నెరవేర్చిన ఓ ప్రభువా
విడువక నా యెడల నీదు- కృప చూపుచున్నావు
దేవా మారని నీ ప్రేమ- సంపూర్ణము-నీ దివ్య ప్రేమ నాలో. ఉప్పొంగెను||హల్లె||
5. మృతిని గెల్చి మా కొరకై -తిరిగి లేచిన ప్రభువా
మా కొరకై త్వరలో రానై – యున్న మహిమ రాజా
దేవా!నీ సన్నిధి నాకు -ఎంతో ప్రియము-నీ దివ్య ప్రేమ నాలో ఉప్పొంగెను||హల్లె||