దేవా నా ప్రభువా నినుగూర్చి ఉప్పొంగె నా హృదయం
1. నీ నామమును నే ఘనపరచి హెచ్చించి పూజింతున్
శ్లాఫిుంచి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై ||దేవా||
2. ఎండిన భూమిలో లేతమొక్కవలె పలుశ్రమలను పొందితివి
వ్యసనాక్రాంతుడవై వ్యాధినొంది నా శిక్షను పొందితివి ||దేవా||
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవె ప్రభూ
పదివేలలో నిను గుర్తించెదను నా పరమ పితా నిన్ను ||దేవా||
4. గొఱ్ఱెపిల్ల పెండ్లివిందునందు రారాజు రూపమును
నిరతంబును చూచే నిరీక్షణతో నింగిని నే జూచెదను ||దేవా||