జీవితమెంతో అల్పము నీ ప్రాణమెంతో స్వల్పము
యేసులేని జీవితం అగమ్యగోచరం
విసిరివెల్లిన గాలి తిరిగిరాదు మళ్ళీ
శాశ్వతము కాదేది యి లోకంలో
ప్రభు యేసునందే నీకు నిజ రక్షణ (2)
నేతగాని నాడికంటే వడిగా మరి
సాగుచున్న క్షణములు నిట్టూర్పుతో (2)
జీవితమే ఓ శాపంగా జీవనమే పోరాటంగా (2)
బ్రతుకుచున్న నీకు యేసే శాంతి (2)
చింతలన్ని బాపి నిన్ను చేరదీసి
కన్నీరు తుడిచే నా యేసుతో (2)
జీవితమే ఓ దీవెనగా జీవనమే ఆనందముగా (2)
బ్రతకాలి నీవు ఎల్లప్పుడు (2)