జయహే జయహే – క్రీస్తేసు ప్రభువుకే జయహే
జయహే జయహే – రారాజు ప్రభువుకే జయహే
నరులను చేసిన దేవునికి – జయహే జయహే
మరణము గెలిచిన వీరునికి – జయహే జయహే
త్రిత్వ దేవునికి జయహే – తండ్రి దేవునికి – జయహే
ఆత్మనాదునికి – జయహే – మన అన్న యేసునకు -జయహే – జయహే
1. తన మాటతో ఈ సృష్టిని – చేసిన దేవునికి జయహే
తన రూపుతో మానవులను – సృజించిన ప్రభువునకు జయహే
ఆది అంతముకు – జయహే – అద్వితీయునకు – జయహే
అత్యున్నతునకు – జయహే – అనాది దేవునికి – జయహే
2. దహించేడి మహిమన్వితో వసించేడి రాజునకు – జయహే
పరిశుద్దుడు పరిశుద్దుడని దూతలు పొగడే ప్రభువుకు జయహే
అగ్ని నేత్రునకు -జయహే – ఆత్మ రూపునకు – జయహే
అమరత్వునకు – జయహే అనంతదేవునకు – జయహే
౩. తన రక్తమున్ మానవులకై కార్చిన యేసునకు -జయహే
తన బలముతో మరణంబును జయించిన వీరునకు – జయహే
సిల్వదారునకు -జయహే – త్యాగసీలునకు -జయహే
మరణ విజయునకు -జయహే – జీవించు దేవునకు -జయహే
4. తన మహిమతో మేఘాలపై వచ్చెడి యేసునకు – జయహే
తనుండేడి స్థలమందున మనలను ఉంచెడిప్రభువుకు – జయహే
న్యాయ తీర్పరికి – జయహే – సర్వశక్తునకు – జయహే
సర్వోన్నతునకు – జయహే – సైన్యముల అధిపతికి – జయహే