తప్పించుకోలేవురా సహోదరా తప్పించుకోలేవురా
పరుగులెత్తి నీవు పాపాలు చేసి
తరుముకుంటూ వచ్చే దైవశిక్ష నుండి
1. హేబెలు అర్పణను లక్ష్యపెట్టె దేవుడు
కయీను కోపంతో చిన్నబోయినాడు
అసూయతో తమ్మునిపై పడి చంపినాడు
దేశదిమ్మరియైు శాపం పొందినాడు
2. విగ్రహానికి మొక్కలేదని కోపించి
దేవుని పిల్లలను అగ్నిలో వేయించి
విర్రవీగినాడు నెబుకద్నెజరు గర్వించి
గడ్డిమేసినాడు పడి గద్దెమీదనుంచి
3. అననీయ సప్పీరా అమ్మినారు ఆస్థంతా
తమకొరకు ఆశతో దాచినారు కొంత
గొప్ప కొరకు చెప్పినారు ఇదేనని అంతా
ప్రాణం విడిచారు చూస్తుండ సంఘమంతా