తొలిరోజుల్లో ఉన్న నీ విశ్వాసం-నేటికి ఏనాటికి దిగజారిందో
మెలకువ కలిగి పరిశీలనచేస్తూ-క్రీస్తులో ముందకుసాగుమా పరిశుద్ధాత్మ శక్తిని పొందుమా
1.ఆత్మానుసారముగా ప్రారంభించావు-శరీరానుసారాముగా దారితప్పావు
అపవాది నిన్ను మోసపుచ్చినా-ఆలోచనలన్నీ చెరిపివేసినా
అన్యాయమార్గంలో నిన్ను నడిపెనా-అన్యునిగా నిన్ను మార్చివేసినా
తెలుసుకో నేస్తమా-తిరిగి తప్పు చేయకుమా
2.జీవముగల దేవుని విడిచిపోవునట్టి-అవిశ్వాస హృదయమును కలిగియున్నావా
జీవాధిపతియగు దేవుని-మరిచిపోయావా-నిర్జీవక్రియలను నీవు చేస్తున్నావా
జీవజల ఊటయైన-దేవుని విడిచావా-ఆత్మీయస్థితిలో నీవు జారిపోయావా తెలుసుకో సోదరీ – కన్నీటితో ప్రార్థించు.