తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా –2
తేజోవాసుల స్వాస్థ్యమందు ……
1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము –2
శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా –2 ॥ తేజో ॥
2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం –2
కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా –2 ॥ తేజో ॥
3. శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము –2
శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా –2 ॥తేజో ॥
4. నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం –2
అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా –2 ॥తేజో॥