తంబురనాదము తంతివాయిద్యములు
మీటెద నేను నాధుని కొరకై
పిల్లనగ్రోవితో నిన్ను భజియించెద
ప్రజలందరిలో నిన్ను ప్రణుతించెద
అ.ప: నాధా నిన్నే స్తుతియించి మహిమ పరతునయ్యా (2)
1.వేల్పులలో నీవు ప్రధముడవు
వెతలు బారిన వైద్యుడవు
వరములు నొసగె దేవుడవు – వాసికెక్కిన పూజ్యుడవు
నాధా నిన్నే స్తుతియించి మహిమ పరతునయ్యా (2)
2.మహిమ ఘనతకు అర్హుడవు
మమతను పంచిన దేవుడవు
మరణము గెలిచిన వీరుడవు
మరలా రానున్న రాజాధిరాజువు
నాధా నిన్నే స్తుతియించి మహిమ పరతునయ్యా (2)