చిత్రమైన పనులు చేసేటిదేవుడు
చీకుచింతలన్నీ తీసేటి దేవుడు
విడిపించే దేవుడు – నడిపించే దేవుడు
అ.ప. : యేసు మంచిదేవుడు – కీడు రానీయడు
1. ప్రవహించే జలములను ఆపివేసెను
సంద్రములో చక్కనైన బాటవేసెను
తన ప్రజలను అద్దరికి నడిపించెను
శత్రువుల సైన్యమును నీటముంచెను
2. దూతల ఆహారమును ధరకు పంపెను
పరలోకపు మన్నాతో కడుపు నింపెను
దాహమైన వేళలో బండ చీల్చెను
ఎడరిలో నీటితో సేదదీర్చెను
3. పగివేళ మేఘములో వెంట వచ్చెను
కాపరియై తన మందకు క్షేమమిచ్చెను
అన్యజనులపై గొప్ప జయము తెచ్చెను
తనవారికి స్వాస్థ్యమును తిరిగి ఇచ్చెను