గలిలియా తీరాన చిన్న నావ యేసయ్యాఏర్పరచుకున్న నావ
యేసయ్యా సేవలో వాడబడిన యేసయ్యా బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా
1.యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవసించినా
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసినా
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా
2.సుడి గుండాలెన్నో ఎదురొచ్చినా
ఫెను తుఫానులెన్నో అడ్డొచ్చినా
ఆగకుండా ముందుకే కొనసాగినా
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా