క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు-రక్షణ తెచ్చిందయ్యా చూడు “2″
ఆనందం వెల్లి విరిసె జగతిలో జ్యోతిగా నేడూ……”2″
అ.ప.: క్రీస్తుకు ఆరాధన-ప్రభువుకు స్తోత్రార్పణ-యేసుకు చెల్లించెదం-హల్లెలూయ…హల్లెలూయ…. “క్రిస్మస్”
1. లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప “2″
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు-విడుదల కలిగించె మనకు… “2″ “క్రిస్మస్”
2. యేసుకు మనలొ చోటిస్తె-మనమొక తారగ కనిపిస్తాం! “2″
పరలోక మార్గం క్రీస్తే…. సమస్తము ఆయనకు అర్పిద్దాం… “2″ “క్రిస్మస్”