కాచి కాపాడినావు – నన్ను రక్షించినావు – 2
గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2
1. ఇశ్రాయేలీల జనాంగమును – ప్రేమతో నీవు పిలిచినావు –2 నలబై ఏళ్ళ ప్రయణములో – కొరతలేక నడిపినావు – 2
నీవే నాతోడుగా… అండగా నిలువగా …. – 2
గడచిన కాలమంతా – నన్ను రక్షించినావు – 2
2. అబ్రాహామును ఆశీర్వదించి – గర్బఫలము ఇచ్చినావు –2
ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి – శారా కోరిక తీర్చినావు 2
నీవే నాతోడుగా…. అండగా నిలువగా …. 2
గడచిన కాలమంతా – నన్ను దీవించినావు – 2