కలువరిగిరిపై సిలువభారం భరించితివా – ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా
1.దుష్టుండనై బల్లెముబూని గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా||కలు||
2.మూడు దినముల్ సమాధిలో ముదముతోడ నిద్రించితివా
ముదముతోడ నిద్రించితివా నా రక్షణకై సజీవముతో
సమాదిన్ గెలిచి లేచిన తండ్రి||కలు||
౩.ఆరోహణమై వాగ్ధనాత్మన్ సంఘముపైకి పంపించితివా
ఆదరణాత్మన్ పంపించితివా నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదన్||కలు||