కొనియాడెదను కృపగల దేవా..-కీర్తింతు నీ కృపాతిశయమును
కృపతో రక్షించిన నా యేసయ్య-సర్వకృపా నిధి స్తోత్రించెదను
అ.ప: కృపా సత్య సంపూర్ణుడా.. దయా దాక్షిణ్య పూర్ణుడా “2″
కృపా క్షేమములే నా కిరీటం-నా ప్రభు యేసుని స్తుతియింతును “కొనియా”
1. నా దోషములను క్షమించు వాడవు-రోగములన్నియు కుదుర్చువాడవు “2”
నా ప్రాణమును విమోచించి-మేలుతో నా హృదిని తృప్తి పరచిన “2″ “కృపా”
2. నీ వాత్సల్యత సదా నిలుచుది-కరుణా కటక్షం నాపై చూపునది “2
నీ భక్తులను విధేయులను-తరతరములకు దీవించు వాడవు “2″ “కృపా”