కృప కనికరముల- మా దేవా – కృతజ్ఞతనర్పింతు
1.యెహోవా చేసిన – ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?
యెహోవా నామమున- ప్రార్థన జేసెదను రక్షణ పాత్రచేబూని (కృప)
2. యెహొవాకు నా – మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను
యెహోవా ప్రజలలో-యెరూషలేములో ఎల్లప్పుడు స్తుతించు(కృప)
3.తల్లి గర్భమున – రూపింపబడక మునుపే నన్ను- ఎరిగితివి
తల్లి గర్భమునుండి -బయలుపడకముందే ప్రతిష్ఠించితివి (కృప)
4. పూర్ణ మనస్సుతో- నన్ను వెదకి నన్ను కనుగొందురంటివి
కరుణతో నీవే- నన్ను వెదకి రక్షించితివి ప్రభువా(కృప)
5. దూషకుడను- హింసకుడను హానికరుడనై యుంటిని
దాసునిగా నన్ను- జేసికొంటివి దోషముల బాపి (కృప)
6. ఇది నీకొరకై- విరువబడిన నా శరీరమనియంటివి
ఇది నీ పాప- క్షమకొరకై చిందిన రక్తమంటివి(కృప)
7.నీదు కృపతో- నాదు యేసు నన్ను నీవు- రక్షంచితివి
కాదునాదు – క్రియలవలన ఇది దేవుని వరమే(కృప)
8.చెప్పనశక్యము -మహిమా యుక్తము నీవొసంగిన-సంతోషము
తప్పకుండ హల్లెలూయ పాటపాడెదన్(కృప)