క్రైస్తవుండా కదలిరావయ్యా కలుషాత్ములకు ఈ సిలువశక్తిని
చాటవేమయ్యా ఎండ వానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు ||2||
కండలను ప్రేమింతువేమయ్యా ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా
1.వసుధలో ప్రజలెల్లరు యేసు వాక్యంబు విని క్షుద్బోదగొని వాదించు చుండగను
మిషనులెల్ల మిషలచేత మిట్టపడుచు వాదములచే యేసు బోధను మరచినారన్నా
నీవెంత కాలము వారి చెంత వుందువోరన్నా ||క్రైస్తవుండా||
2.సత్య వాక్యము సంతలో దులిపి భోదకుల దొరల భత్యములపై భాంతులు నిలపి –
చిత్తమగు అనుకూల బోధలు చేసి ప్రజల మోసగించే – సూత్రదారుల చేరరాదయ్య –
సుఖ భోగమిడిచి సత్య వాక్యము చాటరావయ్యా ||క్రైస్తవుండా||
3.శక్తిహీనుడవందు వేమయ్యా సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా –
భక్తిహీనత పారద్రోలి భష్ట మనసు బయలు పరచి –
శక్తితో సువార్త చాటుదువు సువార్తచే జయమొంది ఆత్మల రక్షించెదవు ||క్రైస్తవుండా||
4.నీతికై భక్తాది పరులెల్లా – నిజ విశ్వాసము నిలుపుకొన పోరాడిరే చాలా –
కత్తిపోటులు రాళ్ళ దెబ్బలు కరుకుగల రంపములు కోతలు –
బెత్తముల కొరడాల దెబ్బలు పైబడి చేర్చే దేహము వాలలాడెను రక్తము భూమిపై ||క్రైస్తవుండా||
5.దూతలకు లేనట్టి పరిచర్య ఓ ప్రియ సఖుడా ఖ్యాతిగా నీకిచ్చె గ్రంధంబు –
ఖేతీయుల వినుము గ్రంధము తేనెవలె మధురముగా నుండును –
జ్ఞానము నీకబ్బునో హితుడా జ్ఞానంబు నొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవుండా||
6.ఆది సంఘము నార్పుటకునేంచి – ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి –
ఆది క్రైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారు పూసి అగ్నిని ముట్టించి కాల్వంగ –
ఆ సంఘమొచ్చె అధిపతి అప్పుడే నశియించే ||క్రైస్తవుండా||