కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్య-నిన్ను పాడి పొగడెదనయ్య నజరేయుడా…
అ.ప.: నజరేయుడా…నా గలలీయుడా….నజరేయుడా…నా గలలీయుడా….
నజరేయుడా…నాదు గలలీయుడా.. “కృపా”
1. వాక్య ప్రణవ రూపమా దివ్యలోక తేజమా-దివి వీడి భువికరుదెంచిన మహిమ రూపమా “2″
దినమెల్ల పాడిన వేనొళ్ళ పొగడినా-నా ఆశతీరదు నా దైవమా “2” “నజరే”
2. ఆత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు-ఆశతీర నిన్ను కొలిచెదను ఆత్మ రూపుడా “2″
ఆదరణ కర్తనీవై నన్నాదరించినావు-ఆత్మభిషెకముతో బలపరిచినావు “2” “నజరే”
3. నిత్యుడైన దేవుడవు నీతీ-స్వరూపుడవు-నిన్న నేడు ఏకరీతిగ ఉన్నవాడవు “2″
నీ ప్రేమ చాటగ మనసార పాడగా-నా భాష చాలదు నా దైవమా “2” “నజరే”