1.కృపా విమోచకా ప్రభూ వేలాది నోళ్ళ నీ
కృపా జయ ప్రభావముల్ సుతింతు నెంతయున్
2 కృపాధికార!దేవా నీ సాయంబు జేయుమా
భవత్ప్రభావ కీర్తులన్ జాటంగా నెల్లెడన్
3 భయంబు చింత బాపును హర్షంభు పాపికి
సౌఖ్యంబు జీవ శాంతులు నీ నామ మిచ్చును
4 విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును
పాపాత్ము శుద్ధి జేయును శ్రీ యేసు రక్తము
5 జనాళి పాపులెల్లరు శ్రీ యేసున్ నమ్ముడి
కృపావిముక్తులందుండి సంపూర్ణ భక్తితో
5అర్పించే యేసు ప్రాణమున్ నరాళి గావను
యజ్ఞంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుడి
6 సత్కీర్తి స్తోత్ర ప్రేమల నబాన భూమిని
సర్వత్ర దేవుడొందుగా సద్బక్త పాళిచే