ఓ దేవా దయచుపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొఱ్ఱను ఆలకించుమా
నీ కృపతో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు ఉజ్జీవం రగిలించు
1. సర్వలోక రక్షకా కరుణించుమయ్యా
నీ వాక్య శక్తీని కనుపరుచుమయ్యా
అందకార ప్రజలను వెలిగించుమయ్యా
పునరుత్తాన శక్తితో విడిపించుమయ్యా
ఒక్కసారి చూడు ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి పరిశుద్దపరచు
దేశాన్ని క్షమించు
ప్రేమతో రక్షించు (ఓ దేవా)
[ప్రార్థన]
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన యెడల,ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును అన్న దేవా మా దేశమును కనికరించుము
అంధకారశక్తుల నుండి. దురాత్మల సముహములనుండి. ఈ దేశమును విడుదల చేయుచున్నాము.
అవినీతి అక్రమాల నుండి. ఉగ్రవాదుల దాడుల నుండి ఈ దేశమును తప్పించుచున్నాము.
నానా విధములైన బాధలతో వ్యాధులతో రుగ్మతలతో బాధపడుచున్న వారిని
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము.
లైంగిక పాపములకు,మత్తు పదార్థములకు
బానిసలైన వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. క్రుంగిన స్థితిలో మరణమే శరణమన్న స్థితిలో ఉన్నవారిని
యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము.
మా దేశ నాయకులను మా దేశ ప్రజలందరినీ వ్యాధి బాధలనుండి
కీడు నష్టములనుండి పాప బందకముల నుండి
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము.
ఆమేన్ ఆమేన్ ఆమేన్…