1.ఓ దివ్యకాంతి,మబ్బు కమ్మఁగా
నన్నడ్పుము
నా యింటి త్రోవ దప్పిపోతిని
నన్నడ్పుము
నా కాళ్ళు జారకుండఁ గాచుచు
ఒక్కోక్క మెట్టు భద్ర పర్చుమా
2.ఇన్నాళ్ళు నేను కోరకుంటిని
నీ శరణు
స్వబుద్ది నమ్మి తప్పిపోతిని సదా
నన్నడ్పుము
గర్వము యేలే నా హృదయము
మన్నించు నా గత జీవితము
3.ఇన్నాళ్ళుఁ గాచియుంట వింతను
నన్నడ్పుము
నా నష్ట కష్ట దుఃఖ బాధలు
పోఁగొట్టుము
నీ వల్ల నేను జయ మెుందుచు
నిన్ను స్తుతించి పాడుదున్ సదా