ఓ యేసు భక్తులారా!
మి రాజు ధ్వజము
గ్రహించి సాహసించి
పోరాడి గెల్వుఁడీ
విశ్వాసులారా రండి
మిా రక్షణార్ధమై
ప్రయాసపడ్డ యేసు
విజయమిచ్చును
2.మిాయం దసూయఁ బట్టి
మిా యాత్మ నాశము
నెన్నండుఁ గోరునట్టి
యనేకు లుందురు
మిా రెల్ల రేసు పేరు
వచించి యాయనే
సర్వాధికారి యంచు
సేవింపవలెను
3.ప్రచండ మైన దండు
పోరాడ లేచినన్
విరోధి శక్తి కొద్ది
మరీ తెగించుఁడీ
స్వకీయ శక్తిఁగాక
శ్రీ యేసు నామమున్
స్మరించి వానియందు
విశ్వాస ముంచుఁడీ