ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?
1.. ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే
మహా భయంకరమో – సింహంబుగా నుండు
2.. లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా
ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును
3.. మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను
ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే
4.. గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి
గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును
5.. నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి
6.. ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో
ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు
7.. దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచును
ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును