ఓ కరుణానిదీ,మహ ప్రభుయేసు -నీవె సింహసనాసీనుడవైతివి
1.. సత్యస్వరూపివి పరిశుద్దుడవు -దావీదు తాళము కల్గియున్నావు నీవు తెరచినది మూయగలేరు
బంధించినది తెరువగలేరెవ్వరు- నీ మహత్మ్యమదే
(ఓ కరుణా)
2.. ఏడు నక్షత్రములు నీ చేత కలవు-దీప స్తంభముల మద్య
సంచరించెదవు – జీవించువాడవు ఆది అంతములు-రెండంచుల
ఖడ్గం కలిగిన ప్రభువా – అదియే నీ ఘనత(ఓ కరుణా)
3.. అగ్నివంటి నెేత్రములు కల్గి-అపరంజివంటి పాదములు కలిగి
దేవుని ఏడు ఆత్మలు కలిగి-గ్రంథము తెరిచే
యోగ్యుడవీవే దన్యుడవు నీవే
4.. నమ్మకమైన సత్యసాక్షియు – సర్వసృష్టికి
కర్తయైయుండి
నీతిమెతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు శక్తిమంతుడు-ఆమెన్ అనువాడు
5.. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు- సాగులో పడెదరు కృతజ్ఞులై
ఆశ్చర్యక్రియలు చేసితివంచు -ప్రభువా నీవే
అగమ్యుడవంచు నినుకొనియాడెదము(ఓ కరుణా)