1.ఓ బెత్లహేము గ్రామమా
సద్దేమిలేకయు
నీ వొంద గాఢ నిద్రపై
వెలుంగు తారలు
కానేమి నిత్య జ్యోతి
జ్వలించు నీతిమిన్
పెక్కేండ్ల నీతి వాంఛలి
రాత్రి తీరె నీలోన్
2 మరియకేసు పుట్టెను
నిద్రింప మర్త్యులు
ఫై గూడి దూతలవింతయూ
ప్రేమన్వీక్షింతురు
చాటుడో వేగుచుక్కల్
ఈ శుధ్ద జన్మము
దైవానకు నున్నతల్ భువిన్
శాంతించు పాడుడి
3 స్దదేమి లేక వచ్చేగా
ఈ వింత దానము
ఆ రీతి దేవుడిచ్చు ఫై
వరాళ్ నరాళికి
నరున్ఁడెరుంగా కున్నను
ఈ పాప దాత్రిలో
దీనులంగీకరించిన
యేసునొందు జొచ్చును
4 ఓ బెత్లహేము పావనా
వత్సా మా ఫై దిగు
పోగొట్టి పాపముల్ మాలో
నీ వేల పుట్టుము
సువార్త క్రిస్మస్ దూతల్
చెప్పంగ విందుము
మా యొధ్ద నుండ రమ్ము మా
ప్రభూ ఇమ్మానుయెల్ ఆమెన్