ఒడ్డు చేరి నీ యెదుట – నిల్పునపుడు రక్షకా
ఒక యాత్మనైన తేక – సిగ్గుపడి పోదువా
1. ఒక యాత్మనైన నేను – రక్షింపక యేసువా1
వట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునా
2 . ఆత్మలందు వాంచలేక – సోమరులై కాలమున్
వ్యర్థ పర్చు వారానాడు – చింత తోడ నిల్తురు
3. యేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు యైనదే
ఐనా పలితంబు జూడ – కష్టపడనైతినే
4. కాలమెల్ల గడ్చిపోయెన – మోసపోతినేనయ్యో
గడ్చినట్టి కాలమైతే – ఏడ్చినను రాదది
5. భక్తులారా దైర్యం తోడ – లేచి ప్రకాశించుడి
ఆత్మ లెల్ల యేసు నొధ్ద – చేరునట్లు చేయుడి