ఎంత దీనాతి దీనమొ యేసయ్యా
నీ జననమెంతో దయనీయమో
తలుచుకుంటే నా గుండే తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
1. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా
ఆ సత్రములో ఓ యేసయ్య నీకు స్ధలమే దొరకలేదయ్య (ఎంత)
2. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సేడివడి పోయెనయ్యా
దిక్కుతోచక ఓ యేసయ్య పశువు పాకలొ ప్రసవించెనయ్యా (ఎంత)
3. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టేనయ్యా
పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్య (ఎంత)