ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది ” 2 “
సిద్ధపడినావా చివరి యాత్రకు ” 2 “
యుగయుగాలు దేవునితో ఉండుటకు నీఉండుటకు ” నీ జీవితం “
సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏమి పట్టుకొని పోవు ” 2 “
పోతున్నవారిని నీవు చూచుటలేదా ” 2 “
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ” 2 ”
” నీ జీవితం ”
మరణము రుచి చూడక బ్రతికే నరుడేవడు
కలకాలము ఈ లోకములో
ఉండే స్థిరుడేవడు ” 2 “
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి ” 2 “
కుల మతాలు అడ్డం కాదు స్మశానానికి ” 2 “
” నీ జీవితం “
పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు
మరణానికి ముందు ” 2 “
యేసు రక్తమే నీ పాపనికి మందు ” 2 “
కడగబడినవారికే గొఱ్ఱెపిల్ల విందు ” 2 ”
” నీ జీవితం “