ప: ఈ రోజు సజీవునిగా నీలో జీవింపజేసితివే
రక్షణానంద బరితుడనై
కృతజ్ఞతా స్తుతి చెల్లింతునయ్యా
నిత్యము నీ సన్నిధిలో (2)
1.ఆకర్షించెను నీ ప్రేమ నన్ను
సుందరుడా మనోహరుడా (2)
యేసయ్యా నీ ప్రేమలోనే
మనస్సుకు నెమ్మది ఆదరణ దొరికే (2)
ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)
2.మరుగై వున్న పరలోక సంగతులు
పామరుడను నాకు తెలియజేసితివి (2)
ఆత్మదీపం వెలిగించి నాలో
నీతో నడచుటకు కృప చూపితివే (2)
ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)
3.నూతన యెరూషలెం నా నివాసమని
నూతన సృష్ఠి గా నన్ను మార్చినావు (2)
నూతన వధువుగా సిద్దవడచు
ఎదురుచూస్తుా జీవింతునయ్యా
ఆ హల్లెలూయా…. ఆ హల్లెలూయా (2)