ఇదిగో నీ రాజు వచ్చుచుండె – సీయోను కుమారి
సంతోషించు – యెరుషలేం కుమారి ఉల్లసించు ॥ ఇదిగో ॥
1. నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
2. రక్షణగల వాడుగ – అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
3. సాత్వికుండు యీభువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
4. దీనవరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
5. ఇలను గాడిదనెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయగీతములతో – వచ్చుచుండె ॥ ఇదిగో ॥
7. యేసుని ప్రేమించుచు – హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయ ॥ ఇదిగో ॥