ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు
అ.ప. : ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము
1. ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా
ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు
2. మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మాదరికి చేరకుండగా
కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
3. ఈ లోక యాత్రలో సాక్షులుగా
నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా
ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు