అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి
1 తలను ముండ్ల కిరీటం బొంది కాళ్ళు చేతుల గ్రుచ్చబడి
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ నా ప్రభువా
2 నీ చింత వలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో
3 నేను జూచెడి మహిమ స్వరం నా వలన కలుగదు
ఆనంద బాష్పములతోనే స్తుతింతు-ఈ ధనము నా కొరకే
4 నీ సిలువలో తొలగే నా నీచ పాపమునే ద్వేషింతు నన్నియున్
నీ సింహాసనము నా లోన యుంచుము నిన్ను నే స్తుతింతును