అమూల్యరక్తము ద్వారా రక్షణపొందిన జనులారా
సర్వశక్తుని ప్రజలారా పరిశుద్దులారా పాడెదము
1. మన యౌవన జీవితమున్- శరీరశకు లోబరచి
చెడుమాటలను పలుకుచు-శాంతి లేక యుంటిమిగా (అమూల్య)
2. చెడు మార్గమున పోతిమి-దాని సెకను మరణము
నరక శిక్షకు లోబడుచు-పాపపు ధనము పొందితిమి (అమూల్య)
3. నిత్య సత్య దేవుని-నామమున మొరలిడక
స్వంత నీతితోడనే-దేవుని రాజ్యము కోరుతిమి(అమూల్య)
4. కనికరముగల దేవుడు-మానవరూపము దాల్చెను
ప్రాణము సిలువను బలిజేసి- మనల విమోచించెను(అమూల్య)
5. తన రక్తధారలలో- మన పాపములను కడిగి
మన కన్నులను తెరిచి – మనవ నింపెను జ్ఞానముతో(అమూల్య)
6. పాపులమైన మన మీద- తన యాశ్చర్య ఘనప్రేమ
కుమ్మరించెను మన ప్రభువు-కృతజ్ఞత చెల్లింతుము(అమూల్య)
7. మన రక్షకుని స్తుతించెదము – మనలను దేశంనుండి ధన్యులుగా
మన దేవుని కర్పించెదము-జీవాత్మ శరీరములన్.(అమూల్య)