అబ్రహము ఇస్సాకు యాకోబులు
విశ్వాస వీరిలో మనకు పితరులూ(2)
ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమువలే ఉండగా(2)
భయమెందుకు! దిగులెందుకు! సాగిపోముందుకూ(2)
1. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే
ఏర్పరచబడినావు దేవున్న కొరకు ..(2)
నాగటిపై చెయ్యి పెట్టి వెనక చూడకూ..(2)
ప్రభులోనికి అడుగు పెట్టి లోకాన్ని కోరకు(2)(అబ్రహము)
2. ఒంటరిగా ఉన్నానని కలత చెందకూ..
ఘనుడైన యెహోవాను మరిచి బ్రతకకూ.(2)
దేవునికై బ్రతుకు వారు నీకు ఆప్తులు (2)
కష్టాలు కన్నీళ్ళు మనకు ఆస్తులు(2)(అబ్రహము)
3. ప్రభువెపుడు తనవారిని విడిచిపోడని
శ్రమలలో తనవారికి తోడుంటాడని(2)
విడిచి పెట్టకు నీదు విశ్వాసమును(2)
విడిచి పెట్టు ప్రభుకొరకు తుదిశ్వాసను(2)(అబ్రహము)