అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును
అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును
నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును
1. నా కోసమే ఆ సిలువలో – ఎన్నెన్ని బాధలు అనుభవించినావు
మరణంబునొందునంతగా – నీ ప్రేమ చూపినావుగా
2. ఇహలోకపు మమతలన్నియు-నీ ప్రేమ ముందు బహుస్వల్పమే
ఇలలోని సంపదాలన్నియు – నీ ఎదుట చూడ అల్పమే
3. ఇల నన్ను కన్నతల్లికన్ననూ – విలువైన ప్రేమ చూపించితివే
వెలలేని మంచిమిత్రుడా – బలమైన నా దేవుడా