అగ్ని మండించు నాలో అగ్ని మండించు –2
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు –2
1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (అగ్ని)
2. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (అగ్ని)
3. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే
4. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా(అగ్ని)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా