ఐక్యతను ఇవ్వవా ప్రభూ సమైక్యతను మా సహోదరులలో ఉంచవా
- పెట్టినాడయా సాతాను కలహంబులను
చెదరగొట్టి నాడయా విశ్వాసులను
గద్దించవా తండ్రి అపవాదిని
ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత||
- సడలిన మా చేతులను బలపరచయ్యా
కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా
తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా
విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత||
- ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా
యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా
జీవింపజేయుమా నీ ఆత్మ ను
ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత||
- కాచినావు సంఘమును నీ దయ వలెనే
నింపినావు బండపై నీ కృప వలెనే
చిరకాలం ఐక్యతనే బంధకములతో, సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు ||ఐక్యత||