హోసన్నా – హోసన్నా – హోసన్నా యోధులమై సాగిపోదము

 

హోసన్నా – హోసన్నా – హోసన్నా  

యోధులమై సాగిపోదము  

 సీయోనులో – నా యేసుతో  

సింహాసనం యెదుట – క్రొత్తపాట పాడెద  

ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు  

 

1. సీయోను మూల రాయిగా – నా యేసు నిలిచి యుండగా  

    ఆత్మసంబంధమైన మందిరముగా  

    కట్టబడుచున్నాను –  యేసుపై        ॥ సీయోను ॥  

 

 2. సీయోను కట్టి మహిమతో – నా యేసు రానై యుండగా  

    పరిపూర్ణమైన పరిశుద్ధతతో  

    అతి త్వరలో ఎదుర్కొందును – నా యేసుని   ॥ సీయోను ॥