హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా

 

హృదయమే అగాధమైన లోయరా మానవులను మలచే కార్ఖానరా 

మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము 

మనిషి మనిషి దోచుకొనే చోటురా 

1. ఆదిలోన హవ్వ పడెను – ఆ లోయలో 

ఆదామును హతమార్చెను – ఆ లోయలో 

పాపమపుడు పుట్టినది – ఆ లోయలో 

పురిటికందు ఏడ్చినది – ఆ లోయలో ||హృదయమే|| 

2. ఆశలణగ ద్రొక్కెను – ఆ లోయలో 

యూదా ఇస్కరియోతును – ఆ లోయలో 

రాణువులకు నాణెములకు దాసుడాయను 

ఘోర మరణమొందెను ఆ లోయలో ||హృదయమే|| 

3. ఎదేనును దూరపరచె ఆ హృదయము 

సిలువ రహదారి వేసే ఆ హృదయము 

మదన పడక మారుమనస్సు తుదకు వేడుము 

హృదయమిచ్చి తలలు వంచి తుదకు వేడుమా ||హృదయమే||