హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము

 

హల్లెలూయ స్తుతి మహిమ 

ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2) 

… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) 

 

అల సైన్యములకు అధిపతియైన 

ఆ దేవుని స్తుతించెదము (2) 

అల సంద్రములను దాటించిన 

ఆ యెహోవాను స్తుతించెదము (2)    ||హల్లెలూయ|| 

 

ఆకాశమునుండి మన్నాను పంపిన 

దేవుని స్తుతించెదము (2) 

బండనుండి మధుర జలమును పంపిన 

ఆ యెహోవాను స్తుతించెదము (2)     ||హల్లెలూయ||