హల్లెలూయా యేసునాధా స్తోత్రముల్ చెల్లింతుమయ్యా

 

హల్లెలూయా యేసునాధా స్తోత్రముల్ చెల్లింతుమయ్యా 

1. మహిమ సింహాసనము – కోటి దూతల గణము 

విడువ బడని భాగ్యము – వదలినా ప్రభూ స్తోత్రముల్ ||హల్లె|| 

2. కల్వరి గిరియందే – మాకు విడుదల కలిగే 

ప్రేమ సత్యము నందు యేసే – విసరబడెనే పిండి వలెనే ||హల్లె|| 

3. సిలువ రక్తము ద్వారానే – మమ్ము కడిగిన ప్రభువా 

మరణమును జయించి నీవు పరమ భాగ్యము నొసగినావు ||హల్లె||