హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

 

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) 

అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్          హల్లెలుయా॥ 

1.వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2) 

నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2) 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         హల్లెలుయా॥ 

2.ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2) 

ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2) 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         హల్లెలుయా॥ 

3.కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2) 

నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే (2) 

ప్రభువా నిన్ను నే కొనియాడెదన్         హల్లెలుయా॥