సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా

 

సృష్టికి శిల్పకారుడా – ఆదిసంభూతుడా 

సమస్త ప్రాణికోటికి ఆధారుడా – ఆద్యంతమూ నీవయా 

నీ ప్రేమకు కొరతలేదయా – నీ జాలికి కొదువలేదయా  (2) 

యేసయ్యా –యేసయ్యా  యేసయ్యా 

హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2) 

1. నా తల్లి గర్భములో నన్ను రూపించి – నీ స్వరూపములో నన్ను చేసినా  (2) 

నిత్యజీవమిచ్చుటకు సిలువలో బలియై– నా పాప ఋణమును తీర్చినదేవా –               యేసయ్యా –యేసయ్యా  యేసయ్యా 

హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2)      “సృష్టికి” 

2.మరణశయ్యపై నేను కృంగియుండగా – నీ కరుణ హస్తమే ఆదరించెను 

నూతన జీవమిచ్చుటకు మరణము గెలచి– నీ రాజ్యవారసునిగా చేసిన తండ్రి 

యేసయ్యా –యేసయ్యా  యేసయ్యా 

హల్లెలూయా-హల్లెలూయా-హల్లెలూయా   (2)        “సృష్టికి”