సియోనులో స్థిరమైన పునాది నీవు

 

సియోనులో స్థిరమైన పునాది నీవు (2) 

నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు (2) ||సియోనులో|| 

1.సూర్యుడు లేని చంద్రుడు లేని-చీకటి రాత్రులు-లేనే లేని (2) 

ఆ దివ్యనగరిలో కాంతులను- విరజిమ్మెదవా-నా యేసయ్యా (2) 

||సియోనులో|| 

2.కడలి లేని కడగండ్లు లేని-కల్లోల స్థితిగతులు-దరికేరాని (2) 

సువర్ణవీధులలో-నడిపించెదవా– నా యేసయ్యా (2)  ||సియోనులో|| 

3.కలతలు లేని కన్నీరు లేని-ఆకలిదప్పులు అసలే లేని (2) 

నీ శాశ్వత రాజ్యముకై-సమకూర్చుచున్నావా-నా యేసయ్యా (2) ||సియోనులో|| 

4.సంఘ ప్రతిరూపము-పరమ యెరూషలేము (2) 

సౌందర్య సియోనులో-నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) 

నీ తోనే నా నివాసము-నిత్యము ఆనందమే (2)   ||సియోనులో||