షారోను వనములో పూసిన పుష్పమై

 

షారోను వనములో పూసిన పుష్పమై 

లోయలలో పుట్టిన వల్లిపద్మమునై 

నీ ప్రేమాతిశయమునే నిత్యము కిర్తుంచుచు 

ఆనందమయమై నన్నె మరిచితిని 

 

1. సుకుమారమైన వదనము నీది – స్పటికము వలె చల్లనైన హృదయము నీది 

మధురమైన నీ మాతల సవ్వడి వినగా – నిన్ను చుడ ఆశలెన్నొ మనసు నిండెనె 

ప్రభువా నిను చెరనా !!షారోను!! 

 

2. సర్వొన్నతమైన రాజ్యము నీది – సొగసైన సంబరాల నగరము నీది 

న్యాయమైన నీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే 

ప్రభువా నిన్ను మరతునా !!షారోను!! 

 

3. సాత్వికమైన పరిచర్యలు నీవి – సూర్యకాంతిమయమైన వరములు నీవి 

పరిమలించునీ పాలన విధులను చూడగా – నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే 

ప్రభువా నిన్ను మరతునా !!షారోను!!