షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు

 

షారోను రోజా యేసే – పరిపూర్ణ సుందరుడు (2) 

ప్రేమ మూర్తియని – ఆదరించు వాడని 

ప్రాణప్రియుని కనుగొంటిని (2) 

అడవులైనా లోయలైనా 

ప్రభు వెంట నేను వెళ్ళెదను (2)         

||షారోను|| 

 

యేసుని ఎరుగని వారెందరో 

వాంఛతో వెళ్ళుటకు ఎవరువున్నారు (2) 

దప్పికతో ఉన్న ప్రభువునకే (2) 

సిలువను మోసే వారెవ్వరు (2)       

||అడవులైనా|| 

 

సీయోను వాసి జడియకుము 

పిలిచిన వాడు నమ్మదగినవాడు (2) 

చేసిన సేవను మరువకా (2) 

ఆదరించి బహుమతులెన్నో ఇచ్చును (2)        ||అడవులైనా||